Header Banner

సస్పెన్స్ కు బ్రేక్.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ!

  Wed Apr 02, 2025 21:44        Politics

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో మరో విమానాశ్రయానికి భారత వాయుసేన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా అనుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..

 

ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు అనుమతులు రావడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన విజయమని అన్నారు. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాలు, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని అధికారులు లేఖలో సూచించారని వెల్లడించారు. తెలంగాణలో విమానాశ్రయాల అనుమతుల మంజూరుకు సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices